మ‌రో యాగానికి టాలీవుడ్ రెడీ ?

-

ఇటీవ‌ల వ‌రుస ప్ర‌మాదాలు టాలీవుడ్ హీరోల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కారు యాక్సిడెంట్లు, ఆన్ సెట్స్ లో అనుకోని ప్ర‌మాదాల‌తో బెంబేలెత్తిపోతున్నారు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీక‌ర‌ణ లో గాయ‌ప‌డ‌టం.. అటుపై నాగ‌శౌర్య కాలు వైజాగ్ షూటింగ్ స్పాట్ లో మేజ‌ర్ ప్యాక్చ‌ర్ కావ‌డం.. శ‌ర్వానంద్ కు శ‌స్ర్త చికిత్స జ‌ర‌గ‌డం, సందీప్ కిష‌న్ కు గాయాలు, అంత‌కు ముందు యువ న‌టుడు సుధాక‌ర్ కొమాకుల‌కి భారీ కారు ప్ర‌మాదంతో హీరోలు బాగా ఇబ్బంది ప‌డ్డారు. తాజాగా సైరా న‌ర‌సింహారెడ్డి లో న‌టిస్తోన్న అనుష్క కు చిత్రీక‌ర‌ణ కాలు విర‌గడం వింటి స‌ఘ‌ట‌న‌లు విస్మ‌యానికి గురిచేస్తున్నాయి. వ‌రుస‌గా ఈ ప్ర‌మాదాలు ఏంటి? అంటూ అంద‌రిలోనూ తెలియ‌ని టెన్ష‌న్ మొద‌లైంది.

ఇవ‌న్నీ చూస్తుంటే టాలీవుడ్ కు మ‌రోసారి కీడు శంకించింది అని కొంద‌రు పెద్ద‌లు భావిస్తున్నారుట‌. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ లో మ‌రోసారి యాగం చేస్తే బాగుటుంద‌ని సురేష్ బాబు లాంటి వారు అభిప్రాయ‌ప‌డుతున్నారుట‌. ఫిలిం న‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో వేద పండితులు స‌మ‌క్షంలో పూజ‌లు నిర్వ‌హిస్తే మంచి జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారుట‌. ఈ నేప‌థ్యంలో ఆల‌య ద‌ర్మ‌క‌ర్త‌లు జ్యోతిష్యుల‌ని క‌లిసిన‌ట్లు స‌మాచారం. గ‌తంలో ఇలాగే టాలీవుడ్ ను వ‌రుస మ‌ర‌ణాలు ఊపిరాడ‌కుండా చేసాయి . పేరున్న న‌టులంతా అనారోగ్యం, వేరు వేరు కార‌ణాల వ‌ల్ల వ‌రుస‌గా మృతి చెంద‌డంతో అంతా భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు.

ఈ నేప‌థ్యంలో పెద్ద‌లు ముందుకొచ్చి ఫిలిం న‌గ‌ర్ ధైవ స‌న్నిధానంలో వారం రోజుల పాటు ప్ర‌త్యేకంగా మృత్యుంజ‌య యాగాలు, పూజ‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. దీంతో శాంతి ల‌భించింది. తాజాగా వ‌రుస చిన్న పాటి ప్ర‌మాదాలు కార‌ణంగా మ‌రోసారి యాగానికి రెడీ అవుతున్నారు? అన్న వార్త స‌ర్వాత్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మ‌రి ఇందులో నిజా నిజాలు ఏంత‌న్న‌ది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news