యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని వైసీపీ లాక్ చేసే ప్రయత్నాలు చేస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది. అందుకు ప్రత్యక్షంగా ఓ సాక్ష్యం కూడా దొరికింది. ఏపీలో డీటీడీ దాదాపు నేలమట్టం అయినట్లేనని ఇప్పటికే సంకేతాలు అందేసాయి. కీలక నేతలంతా బీజేపీలో కి జంప్ అవుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఏపీలో టీడీపీ పరిస్థితి తల ఉన్నా! మెండేం లేని సన్నివేశం ఎదురైంది. కేవలం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు తప్పా! మిగతా వారంతో ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ కోలుకునే అవకాశమే దరిదాపుల్లో కనిపించలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మొదటి నుంచి దూరంగానే ఉంటున్నాడు. చంద్రబాబు పార్టీలో ఉన్నంత కాలం తారక్ అటు వైపు చూసే అవకాశమేలేదని ఇటీవల చోటు చేసుకున్న సన్నివేశాన్ని బట్టి మరోసారి అర్ధమైంది.
సరిగ్గా ఇదే అవకాశాన్ని ఇప్పుడు వైఎస్సార్ సీపీ తారక్ ను తమ వైపుకు తిప్పుకునే లా వాడుకుంటుందని వినిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీలో తీర్ధం పుచ్చుకున్నాడు. పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఓ సమావేశంలో వైసీపీ మంత్రి పెర్ని నాని చేసిన వ్యాఖ్యలే ఇంతటి చర్చకు దారి తీసాయి. జూనియర్ ఎన్టీఆర్ ని నటుడిగా తీర్చి దిద్దింది మంత్రి కొడాలి నాని అంటూ బహిరంగ సభలో వ్యాఖ్యానించడం అంతా ర్చకు దారి తీసింది. తారక్ కి నటనలో ఓనమాలు నేర్పింది నాని అని, నాని హరికృష్ణ ప్రియ శిష్యుడుని..అందుకే తారక్ కి కూడా నాని అంటే ప్రాణ సమానంగా భావిస్తాడని అన్నారు. పెర్ని మాటలు అన్నీ నిజం కాకపోయినా కొంత వాస్తవమైతే ఉంది.
కొడాలి నాని- తారక్ మంచి స్నేహితులు. సినిమా ఇండస్ర్టీలో తారక్ బాగా నమ్మే వ్యక్తి నాని. ఓ సందర్భంలో తారక్ జగన్ గురించి తన వద్ద ప్రస్తావన కూడా తీసుకొచ్చారన్న మాట కూడా ఈ సందర్భంగా వినిపిస్తోంది. తారక్ దగ్గర బంధువులు సహా, కొంత మంది స్నేహితులు వైసీపీలో యాక్టివ్ గా ఉండటం పట్ల తారక్ సంతోషంగా ఉన్నాడని వైసీపీ నేతలు బయట చెప్పుకోవడం విశేషం. ఆ నమ్మకంతోనే పెర్ని తారక్-నానిలను ఉద్దేశించి బహిరంగంగా మాట్లాడాడని వేదిక వద్ద హాట్ టాపిక్ అయింది. ఇవన్నీచూస్తుంటే తారక్ ని ఎలాగైనా వైసీపీలో లాక్ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమైంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.