తెలంగాణలో అభివృద్ధి ఓర్వలేకే బీజేపీ గొడవలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

-

మరోసారి కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. ఎనిమిదేళ్లుగా తాము చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొందరు బీజేపీ లీడర్లు గొడవలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఆరోపించారు. మహబూబ్​నగర్​ నియోజకవర్గంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మహబూబ్​నగర్ మున్సిపల్ పరిధిలోని ఎదిరలో 57 సంవత్సరాలు దాటినా 104 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ చేశారు శ్రీనివాస్​గౌడ్. ఇదే వార్డుకు చెందిన యూపీఎస్​ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ విద్యాలయగా ఎంపిక కావడంతో హెచ్​ఎం హేమచంద్రను మంత్రి సన్మానించారు.Delegation led by State Minister Srinivas Goud meets Central officials

అలాగే వార్డుకు చెందిన రైతు బి.కిష్టయ్యకు చెందిన మూడు బర్రెలు కరెంటు షాక్​తో చనిపోగా, బాధిత రైతుకు రూ.1.20 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. అనంతరం జడ్పీలో 160 మందికి రూ. 79.55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు ఎదిర అంటే ఏరిపారిసినట్లు ఉండేదని, ఫ్లోరైడ్ సమస్యతో స్థానికులు అవస్థ పడేవారని గుర్తు చేశారు. రూ.9 కోట్లతో తాగునీటిని తీసుకొచ్చామని చెప్పారు. సమీపంలోనే ఐడీ కారిడార్ నిర్మించామని, అక్కడ భూములు కోల్పోయిన వారికి అత్యధికంగా రూ.12 లక్షల పరిహారం ఇచ్చామన్నారు శ్రీనివాస్​గౌడ్. త్వరలోనే ఐటీ కారిడార్ ను ప్రారంభిస్తున్నామని, ఐదు వేల మందికి మందికి శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు శ్రీనివాస్​గౌడ్. అనారోగ్యంతో బాధపడే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్థరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తానని చెప్పారు శ్రీనివాస్​గౌడ్.

 

Read more RELATED
Recommended to you

Latest news