ట్విన్ టవర్స్ కూల్చివేత : అసలు సవాల్ ముందుంది..!

-

ఎట్టకేలకు నోయిడా ట్విన్ టవర్స్ కూల్చేశారు. కూల్చడమైతో అయిపోయింది కానీ అధికారుల ముందు ఇప్పుడు మరో పెను సవాల్ ఉంది. పర్వతంలా పేరుకుపోయిన ఈ జంట భవనాల శిథిలాలను తొలగించడం. దాదాపు 55వేల టన్నులు ఉన్న ఈ శిథిలాల్లో రాళ్లు, ఇనుపకడ్డీలు, ఉక్కు వంటివి ఉన్నట్లు అధికారులు తెలిపారు.

శిథిలాలను తొలగించడానికి దాదాపు 3 నెలలు పడుతుందని అంచనా వేశారు. అయితే ముందుగా నిర్దేశించిన ప్రదేశాలకే ఈ శిథిలాలు తరలించనున్నారు. ఈ టవర్స్‌ కూలిన సమయంలో పెద్ద ఎత్తున ఎగసిపడిన దుమ్మును నియంత్రించేందుకు అధికారులు వాటర్‌ స్ప్రింక్లర్లతో పాటు యాంటీ స్మాగ్‌ గన్‌లను ఘటనా స్థలానికి ఇప్పటికే తరలించారు.

‘క్లీనింగ్ పని మొదలైంది. వాయు నాణ్యతా సూచీని పరిశీలిస్తున్నాం. శిథిలాలు పడటంతో 10 మీటర్ల సమీపంలోని సొసైటీ చెందిన సరిహద్దు గోడ ధ్వంసమైంది. అది తప్ప మరెక్కడా నష్టం వాటిల్లినట్టు ఇప్పటివరకు సమాచారం అందలేదు. జంట భవనాల కూల్చివేతకు ముందు, తర్వాత వాయు నాణ్యతా సూచీ (AQI) దాదాపు ఒకేలా ఉంది. ఇప్పటికే ఖాళీ చేయించి వేరే చోటకు తరలించిన చుట్టుపక్కల నివసించేవాళ్లని ఈ రాత్రికల్లా అనుమతిస్తాం. 100 వాటర్‌ ట్యాంకర్లు , 300 మంది క్లీనింగ్‌ సిబ్బందిని మోహరించాం’’’ అని నోయిడా అథారిటీ సీఈవో రితూ మహేశ్వరి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news