కానిస్టేబుల్ పరీక్షలో తప్పుడు ప్రశ్నలపై.. రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక ప్రకటన

-

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం రోజున ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షను విజయవంతగా పూర్తిచేశారు అధికారులు. అయితే.. ఈ తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో పలు ప్రశ్నల్లో తప్పులు ఉన్నట్టు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి.

13 ప్రశ్నల్లో గందరగోళం ఉన్నట్లు అభ్యర్థులు గుర్తించగా ? ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు వస్తే TSLPRB మార్కులు కలిపే అవకాశం ఉందని వార్తలు గుప్పుమన్నాయి. గరిష్టంగా 8 మార్కులు కలపవచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే దీనిపై స్వయంగా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ స్పందించింది.

కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో తప్పులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని.. మొత్తం 13 ప్రశ్నల్లో గందరగోళం అనేది కేవలం ప్రచారమేనని పేర్కొంది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. సెట్ D లో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయని.. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలించి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టమైన సమాచారం ఇస్తామని పేర్కొంది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్.

Read more RELATED
Recommended to you

Latest news