కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా

-

నాకు ఎలాంటి పదవి అవసరం లేదు. పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తా. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే నేను కూడా ఈ పదవికి రాజీనామా చేశా.. అని రాజీనామా అనంతరం రేవంత్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన చీఫ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు చెందిన పలువురు ముఖ్యనాయకులు కూడా రాజీనామా చేశారు. నిన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా పార్టీకి రాజీనామా చేశారు.

తాజాగా రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రయోజనాల కోసమే తాను రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు.

నాకు ఎలాంటి పదవి అవసరం లేదు. పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తా. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే నేను కూడా ఈ పదవికి రాజీనామా చేశా.. అని రాజీనామా అనంతరం రేవంత్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news