ఇంగ్లాండ్ టీంకు బిగ్ షాక్..జట్టు నుంచి తప్పుకున్న బెయిర్ స్టో !

-

ఇంగ్లాండ్‌ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. అక్టోబర్ లో జరగనున్న టి20 ప్రపంచ కప్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు శుక్రవారం 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. కాగా జట్టును ప్రకటించి 24 గంటలు గడవకముందే ఇంగ్లాండు కు బిగ్ షాక్ తగిలింది. విధ్వాంసకర ఆటగాడు జానీ బేర్ స్టోర్ అణువ్య రీతిలో టి20 ప్రపంచ కప్ కు దూరమయ్యాడు.

“బేయిర్ స్టో దూరం అవడం మా దురదృష్టం. శుక్రవారం లీడ్స్ లో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో కాలికింది భాగంలో తీవ్ర గాయం అయింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. బేయిర్ స్టో ను పరిశీలించిన వైద్యులు సర్జరీ అవసరం ఉందని పేర్కొన్నారు.

దీంతో సౌతాఫ్రికా తో టెస్టు సిరీస్ తో పాటు టి20 ప్రపంచ కప్ కు దూరం కానున్నాడు” అని ఈసీబీ పేర్కొంది. కాగా ఓవల్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరగనున్న మూడో టెస్టు కు బేయిర్ స్టో స్థానంలో బెన్ డకేట్ ను ఎంపిక చేశారు. అయితే టి20 ప్రపంచ కప్ కు మాత్రం బేయిర్ స్టో స్థానంలో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news