రైతులకు గిట్టుబాటు ధర మేమిస్తాం అంటున్న mr.farmer

-

ఇది ఇప్పటి సమస్య కాదు. గత దశాబ్దాలుగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. అనాదిగా రైతన్న గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నాడు. అయితే.. రైతన్నకు గిట్టుబాటు ధర మేమిస్తాం.. అని ముందుకు వచ్చింది mr.farmer అనే సంస్థ.

మీకు వ్యవసాయం గురించి కాస్తో కూస్తో అవగాహన ఉంటే గిట్టుబాటు ధర గురించి ఐడియా ఉండే ఉంటుంది. నేటి తరుణంలో ఎంతో కష్టపడి పంట పండించిన రైతన్నకు వచ్చే ధర చాలా తక్కువ. పంట మార్కెట్ రేటుకు.. రైతన్నకు ఇచ్చే రేటులో చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే.. రైతుకు చెందాల్సిన గిట్టుబాటు ధర చెందడం లేదు. అడ్డికి పావుశేరు రైతుకు ఇచ్చి.. మిగితాదంతా దళారులు దోచుకుతింటున్నారు.

ఇది ఇప్పటి సమస్య కాదు. గత దశాబ్దాలుగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. అనాదిగా రైతన్న గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నాడు. అయితే.. రైతన్నకు గిట్టుబాటు ధర మేమిస్తాం.. అని ముందుకు వచ్చింది mr.farmer అనే సంస్థ.

అవును.. రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించేలా వెసులుబాటు కల్పిస్తున్నామంటున్నారు వీళ్లు. అంటే.. రైతు తను పండించిన పంటకు తానే ధర నిర్ణయిస్తాడు. ఆ ధర ప్రకారమే మిస్టర్ ఫార్మర్ అనే సంస్థ పంటను కొనుక్కుంటుంది. దీంతో రైతుకు గిట్టుబాటు ధర వచ్చినట్టే కదా.

రైతుకు, వినియోగదారుడికి మధ్య దళారుల వ్యవస్థ లేకుండా.. రైతన్న పండించిన పంటను డైరెక్ట్ గా వినియోగదారుడికి చేరేలా ప్రణాళికలు రచించింది ఈ సంస్థ. దీని వల్ల పూర్తిగా దళారీ వ్యవస్థను నిర్మూలించి.. రైతన్నకు గిట్టుబాటు ధర కల్పించవచ్చనేది ఈ సంస్థ ఆలోచన. ఈ సంస్థను ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు స్థాపించారు. త్వరలోనే ఈ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా రైతుల వద్దకే ఈ సంస్థ వెళ్లి వాళ్ల దగ్గర పంటను వాళ్లు నిర్ణయించిన ధరకే కొని.. వాటిని డైరెక్ట్ గా వినియోగదారుడికి చేర్చడమే ఈ సంస్థ ముందున్న లక్ష్యం.

Read more RELATED
Recommended to you

Latest news