ఈరోజుల్లో సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఫెమస్ అవుతున్నారు..వారిలోని టాలెంట్ ను బయట పెడుతూ స్టార్స్ అవుతున్నారు.అలా పాపులర్ అయిన వాళ్ళు ఇప్పుడు సినిమాలు,బుల్లి తెర షో లలో చూస్తూనే ఉన్నాము..యూత్ డ్యాన్స్ కు మంచి క్రేజ్ ఉంది..ఎవరిదైనా డ్యాన్స్ బాగుంటే దానికి లైకులు,కామెంట్ల తో మరింత ఫెమ్ వచ్చేలా చేస్తారు..
ఇది ఇలా ఉండగా యాబై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మ్యూజిక్ వినిపిస్తే తీన్మార్ డ్యాన్స్ తో ఇరగ దీస్తున్నారు..ఇటీవల కాలంలో ఇటువంటి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి..మొన్నీమధ్య ఓ బామ్మ ఫాస్ట్ స్టెప్పులతో డ్యాన్స్ ను ఇరగదీసింది.ఆ డ్యాన్స్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ తర్వాత మరో బామ్మ పెళ్ళి కూతురితో పోటీ పడి మరి డ్యాన్స్ చేసింది..అది కూడా వైరల్ అయ్యింది.తాజాగా మరో డ్యాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది..
బాలీవుడ్ మూవీ పాటకు 82 ఏళ్ల వ్యక్తి వేసిన స్టెప్పులకు స్టేజ్ షేక్ అయ్యింది.మెరుపులా కదులుతూ స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో తాత వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఖూబ్‌సూరత్ మూవీలోని అభి తో పార్టీ షురూ హుయి హై అనే పాటకు 82 ఏళ్ల వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీగం పటేల్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్‌తో వృద్ధుడి డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఐ లవ్ దిస్ మ్యాన్ అంటూ వీడియో చివరన నీగం వ్యాఖ్యానించారు. అంకుల్ ఫౌండ్ ది పౌంటెన్ ఆఫ్ యూత్ అని ఈ పోస్ట్‌కు ట్యాగ్ చేశారు..మొత్తానికి ఆ వీడియో కాస్త చర్చనీయాంశంగా మారింది.ఒక్క డ్యాన్స్ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకొండి..ఎలా వుందో కామెంట్ కూడా చెయ్యండి..