నిమజ్జనం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ఒక్కరోజే 7,334 మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు

-

రాష్ట్రంలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు ముగింపునకు చేరుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దాదాపుగా గణపతి నిమజ్జనం పూర్తైంది. మండపాలు, ఇళ్ల వద్ద ప్రతిష్ఠించిన వినాయక ప్రతిమలను భక్తులు బ్యాండ్ బాజాలతో గంగమ్మ ఒడికి చేర్చారు. రెండ్రోజులుగా భాగ్యనగరంలో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు సడలించారు. ప్రస్తుతం యథావిధిగా వాహనాలు నడుస్తున్నాయి. అన్ని మార్గాల్లో వాహనాలను అనుమతిస్తుండటం వల్ల ట్రాఫిక్ కాస్త తగ్గింది.

మరోవైపు గణేశ్ నిమజ్జనం పూర్తవ్వడంతో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్యంపై ఫోకస్ పెట్టింది. ఓ వైపు గణపతి విగ్రహాల నిమజ్జనం.. మరోవైపు భారీ వర్షాలతో నగరమంతా చిత్తడి చిత్తడి అయింది. హైదరాబాద్‌లో ఇవాళ ఒక్కరోజే 7,334 మెట్రిక్‌ టన్నుల చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. 40 జేసీబీలు, 330 వాహనాలతో చెత్త తరలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో 330 వాహనాలకు అదనంగా మరో 97 వాహనాలు, 27 అదనపు జేసీబీలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది వినియోగించారు. నగరంలోని 74 బేబీ పాండ్స్‌లో 89వేల విగ్రహాలు నిమజ్జనం చేశారని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news