కమెడియన్ ఆలీ జనసేన పార్టీలోకి చేరబోతున్నారా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ ఆలీ, చిరంజీవి మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలలో కూడా నటించడం జరిగింది. కమెడియన్ ఆలీ ప్రస్తుతం రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి తన వంతు సహాయం చేశారు అలీ. అయితే ఇప్పుడు తాజాగా కమెడియన్ ఆలీ జనసేనలోకి చేరబోతున్నారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

కమెడియన్ ఆలీ పవన్ కళ్యాణ్ కు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఆలీ జనసేన లోకి చేరుకోకుండా గత ఎన్నికలలో వైసీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక జగన్ గెలుపు కోసం ఆలీ ప్రచారం కూడా చేశారు. అయితే గెలిచిన తర్వాత ఆలీకి ఒక మంచి పదవి ఇవ్వబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కమెడియన్ ఆలీ ని పలుసార్లు పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని రాజ్యసభ ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా కమెడియన్ ఆలీ పేరు బాగా వినిపించింది. కానీ ఆయనకు ఇప్పటివరకు ఎలాంటి పదవి దక్కలేదు. అది తరువాత ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తారని చర్చలు కూడా వినిపించాయి. చివరికి అది కూడా రాలేదు. ఇప్పటివరకు వైసీపీకి సపోర్ట్ చేసిన నటులకు ఏ పదవి దక్కలేదని చెప్పవచ్చు.

ఆలీ వైసీపీ తీరుపై అసంతృప్తిగా ఉండడంతో పార్టీ మారాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా జీవితంలో ఆలీ ఒక్కసారి అయినా ఎమ్మెల్యే కావాలనే ఆశయంతో ఉన్నట్లుగా ఆయన సన్నిహితుల వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కమెడియన్ ఆలీ వైసీపీకి చాలా అన్యాయం చేసిందని భావించి జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కమెడియన్ ఆలీ సొంత జిల్లా తూర్పుగోదావరి.. అందుచేతనే అక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ బలంగా ఉండడం చేత జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఆలీ ఎలా స్పందిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news