జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

-

కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు షాకులు ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో ఏపీలో అధికార పార్టీ వైసీపీకి బుధ‌వారం ఓ గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక చెల్ల‌దంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈ మేర‌కు వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డికి రాసిన లేఖ‌లో ఈ అంశాన్ని ప్ర‌స్తావించింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఇటీవ‌ల జ‌రిగిన వైసీపీ ప్లీన‌రీలో భాగంగా వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌ను ఆ పార్టీ స‌భ్యులు ఎన్నుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై ఎన్నిక‌ల సంఘం వివిధ మీడియా సంస్థ‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌ను చూసిన త‌ర్వాత ఈ మాట నిజ‌మేనా? అని నిర్ధారించుకునేందుకు విజ‌య‌సాయిరెడ్డికి ప‌లుమార్లు లేఖ‌లు రాసింద‌ట‌. అయితే ఆ లేఖ‌ల‌కు సాయిరెడ్డి నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో ఈ మాట నిజ‌మేన‌ని తాము భావిస్తున్నామ‌ని, దీనిపై పార్టీలో అంత‌ర్గ‌త విచార‌ణ జ‌రిపి… అస‌లు విష‌య‌మేమిటో తెలపాలంటూ తాజా లేఖ‌లో సాయిరెడ్డిని ఆదేశించింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

 

CM Y S Jagan Mohan Reddy launches six electronics projects in Andhra  Pradesh | Cities News,The Indian Express

ఈ లేఖ‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించింది. ప్ర‌జాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా త‌ర‌చూ ఎన్నిక‌లు జ‌రుగుతూ ఉండాల్సిందేన‌ని ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది. అదే స‌మ‌యంలో ఏ పార్టీలో అయినా ఓ నేత‌ శాశ్వ‌త అధ్య‌క్షుడుగా గానీ, ఆ నేత‌కు శాశ్వ‌త ప‌ద‌వులు గానీ వ‌ర్తించ‌వ‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ఏ పార్టీ ఎన్నిక‌లు అయినా ఎన్నిక‌ల సంఘం జారీ చేసిన నియ‌మ నిబంధ‌న‌ల మేరకే జ‌ర‌గాల్సి ఉందని తెలిపింది. జ‌గ‌న్ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా ఎన్నికై ఉంటే.. వైసీపీ నిర్ణ‌యం ఎన్నిక‌ల సంఘం నియ‌మ నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మేన‌ని ఎన్నికల సంఘం అభిప్రాయ‌ప‌డింది. ఈ త‌ర‌హా నిర్ణ‌యాలు ప్ర‌జాస్వామ్యంలో చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

Read more RELATED
Recommended to you

Latest news