హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. హైదరాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
187 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.5 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టి20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది.
ఇక భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 69 పరుగులు, విరాట్ కోహ్లీ 63 పరుగులు చేసి టీమ్ ఇండియాకు గ్రాండ్ విక్టరీ అందించారు. ఈ విక్టరీతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. అటు ఆస్ట్రేలియా బౌలర్లలో సామ్స్ 2, కమ్మిన్స్ 1, హెజెల్ వుడ్ 1 పడగొట్టారు.