సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు పోస్ట్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని వీడియో ఆసక్తికరంగా ఉండటంతో క్షణాల్లో వైరల్ అవుతాయి..ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. చదువు వున్నవారైనా, చదువు లేనివారైనా ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది. దాంతో ఆటోమేటిక్ గానే సోషల్ మీడియా పరిధి పెరిగిపోయింది. దాంతో ప్రపంచం నలుమూలలా వున్న ఆసక్తికరమైనటువంటి విషయాలను జనాలను ఇట్టే తెలుసు కోగలుగుతున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, బలమైన వాడు పేరొందిన ఉక్రెయిన్‌కి చెందిన ఒలెక్సి నొవికోవ్ తాజాగా మరో రికార్డ్ సాధించాడు. ఏకంగా 548 కిలోల బరువును పైకి లేపి.. ప్రపంచంలోనే అత్యధిక బరువు ఎత్తిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. రెండేళ్ల క్రితం అంటే 2020వ సంవత్సరంలోనే ప్రపంచంలోనే అత్యంత దృఢకాయుడిగా రికార్డు సృష్టించారు ఒలెక్సి. ఈ ఏడాది కూడా ఆ పోటీలో పాల్గొన్నప్పటికీ ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు..కాస్త నిరాశ వున్న తర్వాత ప్రయత్నాలు చెద్దామని అనుకున్నాడు.
అయితే యూరప్ ఖండం పరిధిలో మాత్రం అత్యంత దృఢకాయుడు ఒలెక్సియే కావడం విశేషం. ఇటీవలే అత్యంత బరువు ఎత్తే ఫీట్ ను చేసి చూపారు. అత్యంత భారీ ట్రక్కులకు వాడే 8 టైర్లను రాడ్ కు చెరోవైపు 4 చొప్పున తగిలించుకుని ఆ బరువును పైకి ఎత్తారు. వాటన్నింటి మొత్తం బరువు 548 కిలోలు. ఈ ఫీట్ కు సంబంధించిన వీడియో రెడ్డిట్ వెబ్ సైట్లో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది..ఆ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే మంచి వ్యూస్ ను రాబట్టింది..అతను రియల్ బాహుబలి అని, రకరకాల కామెంట్స్ ను చేస్తున్నారు..