ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మూలాయం.. సోమవారం ఉదయం గురుగ్రాం లోని వేదాంత ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ విషయాన్ని ములయం తనయుడు అఖిలేష్ యాదవ్ ధృవీకరించారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మూలయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ నేపథ్యంలో యూపీలో జరిగే మాజీ సీఎం మూలయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు రేపు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఆయనకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలపనున్నారు. గత వారం మూలాయం ఆరోగ్య పరిస్థితిపై అఖిలేష్ తో మాట్లాడిన కెసిఆర్.. త్వరలోనే వచ్చి కలుస్తానని చెప్పారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు.