20 సంవత్సరాల క్రితం డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం ” చెన్నకేశవరెడ్డి”. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపత్రాభినయంలో నటించారుు. ఈ సినిమాలో టబు, శ్రియ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాను 20 సంవత్సరాల తర్వాత నందమూరి అభిమానుల కోసం రీ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 25వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చింది.
ఈ మూవీ రీ రిలీజ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ రీ రిలీజ్ లో ప్రపంచవ్యాప్తంగా 5.39 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ నేపద్యంలో ఈ మూవీ నిర్మాత బెల్లంకొండ సురేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రీ రిలీజ్ లో వచ్చిన పూర్తి డబ్బుని బాలకృష్ణ క్యాన్సర్ ఆసుపత్రికి డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. బెల్లంకొండ సురేష్ తీసుకున్న ఈ నిర్ణయం పై నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#ChennaKeshavaReddy pic.twitter.com/Vymz3fCMqt
— Aakashavaani (@TheAakashavaani) October 10, 2022