కోమటిరెడ్డి బ్రదర్స్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు కోమటిరెడ్డి లు కాదు.. కోవర్ట్ రెడ్డిలు అని తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేటీఆర్ లాగా తాను తండ్రి చాటు బిడ్డను కాదని స్పష్టం చేశారు. నన్ను కోవర్ట్ అని తిట్టడం ఏంటి? కేటీఆర్ దీనికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బోయినపల్లి అభిషేక రావును అరెస్టు చేశారని.. ఆ తరువాత కల్వకుంట్ల కవిత అరెస్టు కాబోతుందని వార్తలు వస్తున్నాయని.. ముందు నీ చెల్లిని కాపాడుకోవాలని అన్నారు. నీరవ్ మోదీలా ఎక్కడ దాచిపెడతావో? అని సెటైర్లు వేశారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమిషన్ల కుటుంబం అని అన్నారు. మీ అవినీతి చిట్టా మొత్తం నాకు తెలుసు.. నా జోలికి వస్తే మీ చిట్టా విప్పుతానని హెచ్చరించారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.