నేను మీ ఆడబిడ్డను.. ఈ ధర్మ యుద్ధంలో నన్ను గెలిపించండి: పాల్వాయి స్రవంతి

-

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. అయితే.. మునుగోడు ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సమయం ముగియక ముందే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. చండూర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా బంగారు గడ్డ గ్రామం నుంచి చండూర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు పాల్వాయి స్రవంతి భారీ ర్యాలీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పేరు పరిశీలన | Palvai  Sravanthi name was considered as Congress candidate in the munugode by  elections– News18 Telugu

అయితే.. ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికలు ధన బలానికి, ప్రజా బలానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రజల్ని నైతికంగా వంచించి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆమె ఆరోపించారు. నేను మీ ఆడబిడ్డను.. ఈ ధర్మ యుద్ధంలో నన్ను గెలిపించండని ఆమె ఓటర్లను కోరారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని, కొంగు చాచి అడుగుతున్నా.. ఒక్కసారి అవకాశం ఇవ్వండని
ఆమె వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news