ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఉదయభాను. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉండేది. ముఖ్యంగా అప్పట్లో సాహసం చేయరా డింభక, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్ తదితర టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది ఉదయభాను. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించి తన నటనతో మెప్పించింది ఉదయభాను. ఆ సమయంలో ఈమెకు పోటీగా ఝాన్సీ ,సుమ తదితర యాంకర్స్ వచ్చినప్పటికీ ఈమె రేంజ్ మాత్రం పడిపోయేది కాదు. కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో 2004లో విజయ్ కుమార్ వివాహం చేసుకొని తన కెరీర్ను కొనసాగించింది. అయితే ఆ సమయంలోనే ఈమె పైన పలు వివాదాలు చుట్టుముట్టడంతో ఒక్కసారిగా సంపాదించిన పేరు మొత్తం పతనమయ్యింది.
ఇక తర్వాత కొన్ని సంవత్సరాలకు ఉదయభాను ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. దాంతో కేవలం ఇమే ఇంటికే పరిమితమైంది. ఇప్పటికీ ఈమె అందాన్ని మాత్రం మెయిన్టైన్ చేస్తూ ఉందని చెప్పవచ్చు. ఎన్నో కార్యక్రమాలలో టీవీ షోలలో జోరు మీద ఉన్న సమయంలోనే ఉదయభాను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈమె జీవితంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయభాను బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వకముందే 15 సంవత్సరాలకే ఒక *స్లిం వ్యక్తితో వివాహం జరిగిందట. కొన్ని కారణాల చేత అతని నుండి విడిపోయి ఒంటరి జీవితాన్ని గడిపింది.
అలా తన కెరియర్ సాఫీగా జరుగుతున్న సమయంలో విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే ఉదయభాను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెకు డ్రైవర్ గా ఉండేవారట, ఉదయభాను ఆఫీసులో పలు రకాల జాబులు కూడా చేస్తూ ఉండేవారని సమాచారం. ఇక అలా వీరిద్దరూ ప్రేమించుకొని తమ తల్లిదండ్రులతో గొడవపడి వివాహం చేసుకుంది ఉదయభాను.అలా తన కెరియర్ మొత్తం గందరగోళంగా అవడంతో నెమ్మదిగా బుల్లితెరకు దూరమైంది. ఉదయభాను సన్నిహితుల దగ్గర నుంచి తెలిపిన ప్రకారం ప్రేమ కారణంగానే ఈమె బుల్లితెరపై అంతగా సందడి చేయలేదని తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఉదయభాను కెరియర్ డ్రాప్ అవ్వడానికి ఆమె చేసిన తప్పే కారణమని చెప్పవచ్చు.