వైసీపీకి ‘ఈనాడు’ టెన్షన్.. రోజుకో రకం..!

-

ఇంతకాలం వార్తలు మాత్రమే హైలైట్ చేస్తూ వచ్చిన ఈనాడు మీడియా సంస్థ..ఇప్పుడు ప్రత్యేకంగా కథనాలు ఇస్తూ వస్తుంది. వార్తలు అంటే..టీడీపీ నేతలు ఏమన్నా వైసీపీపై ఆరోపణలు చేస్తే వాటిని ఎక్కువ హైలైట్ చేసేది. అలా అని వైసీపీ నేతలు..టీడీపీకి ఇచ్చే కౌంటర్లని కూడా ఈనాడు పత్రికలో వేసేది. కానీ ఈనాడు పత్రికలో ఎప్పుడు…ఆంధ్రజ్యోతి, సాక్షిల్లో వచ్చినట్లుగా సొంత కథనాలు రాలేదు. ప్రత్యేకంగా టార్గెట్ చేసి కథనాలు ఇవ్వలేదు.

కానీ ఇటీవల కాలంలో ఈనాడు వైఖరి మారింది..వరుసపెట్టి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు, నేతల అక్రమాలు అంటూ కథనాలు ఇస్తుంది. అయితే జగన్‌తో సహ వైసీపీ నేతలు పదే పదే యెల్లో మీడియా అని, దుష్ట చతుష్టయం అంటూ ఈనాడుని టార్గెట్ చేయడం..పైగా రామోజీరావుపై వ్యక్తిగత విమర్శల దాడికి దిగడంతో..ఈనాడు సైతం వారికి తగ్గట్టుగా కౌంటర్లు ఇవ్వాలని లక్ష్యంగా..ప్రత్యేక కథనాలని మెయిన్ ఎడిషన్‌లో ఫస్ట్ పేజ్‌లో వేయడం మొదలుపెట్టింది.

మొదట రాజధాని అమరావతిపై వైసీపీ విషం చల్లుతుందని కథనం ఇచ్చింది. తర్వాత పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలని హైలైట్ చేసింది..రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం, రోడ్లు దారుణంగా ఉండటంపై వార్తలు వేస్తూ వస్తుంది. ఇక ఇటీవల ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు..విశాఖ రాజధాని అంటూ పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని కోసమని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమని వైసీపీ నేతలు అధికారంలో ఉంటూ కూడా ఉద్యమం అని మొదలుపెట్టారు. అలాగే చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తుందని మాట్లాడారు. ఇక వీటికి కౌంటర్లుగా అసలు ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తుంది, విశాఖలో భూములు దోచుకుంటుంది వైసీపీ నేతలే అని చెప్పి ఆధారాలతో సహ ఈనాడు కథనాలు వేస్తుంది. ఇటీవల విశాఖలో విజయసాయి రెడ్డి భూ అక్రమాలు అని కథనం ఇచ్చింది. ఈ ఆరోపణలని విజయసాయి డిఫెన్స్ చేసుకోవడానికి కష్టపడ్డారు.

అలాగే రాజధాని విషయంలో జగన్ ఎన్ని సార్లు మాట మార్చరానే విషయంపై కథనం ఇచ్చింది. ఇక ఉత్తరాంధ్ర వెనుకబడిందని, ఉత్తరాంధ్రకు టీడీపీ ద్రోహం చేస్తుందని పదే పదే ఆరోపిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావుని ఈనాడు టార్గెట్ చేసింది. ఉత్తరాంధ్రలో ధర్మాన దోపిడి అంటూ కథనం ఇచ్చింది. ఉదాహరణకు మాజీ సైనికుల పేరుతో విశాఖ శివార్లలో కేటాయించిన 71.29 ఎకరాలని హస్తగతం చేసుకున్నారని ఆరోపించింది. ఇంకా పలు ఆరోపణలని ఆధారాలతో సహ ఈనాడు పత్రికలో ప్రచురించారు. ఇలా వరుసపెట్టి ఈనాడు..వైసీపీ టార్గెట్‌గా దూకుడు ప్రదరిస్తుంది. దీంతో రేపు ఎవరిని టార్గెట్ చేస్తుందో అని భయం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news