వంగవీటి బ్యాగ్రౌండ్ వర్క్..వైసీపీకి చెక్?

-

ఏపీ రాజకీయాల్లో వంగవీటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కాపు సామాజికవర్గంలో పట్టున్న వంగవీటి ఫ్యామిలీ..కొన్ని స్థానాల్లో గెలుపోటములని మార్చగలదు. కాపు వర్గం ప్రభావం ఉన్న స్థానాల్లో వంగవీటి ఎఫెక్ట్ ఉంటుంది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వంగవీటి ఫ్యామిలీ ప్రభావం ఉంది. కానీ వంగవీటి రంగా వారసుడుగా ఉన్న రాధా మాత్రం రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోతున్నారు..2004లోనే సక్సెస్ అయ్యి ఎమ్మెల్యే అయ్యారు..ఆ తర్వాత పార్టీలు మారినా, స్థానాలు మారినా సరే సక్సెస్ అవ్వలేదు.

చివరికి వంగవీటి అనుచరులు శత్రువులుగా భావించే టీడీపీలోకి రాధా వచ్చారు..గత ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేశారు..కానీ పోటీ చేయలేదు. అయితే ఊహించని విధంగా టీడీపీ ఓడిపోయి..ప్రతిపక్షంలోకి వచ్చింది. దీంతో రాధా కాస్త రాజకీయాలకు దూరంగా ఉంటూ..తన రంగా ఆశయాల కోసం పనిచేస్తున్నారు. అలా అని ఆయన ఏ పార్టీలోకి వెళ్ళడం లేదు. మళ్ళీ వైసీపీలోకి తీసుకురావడానికి కొడాలి నాని, వంశీ లాంటి వారు ట్రై చేశారు. ఇటు జనసేన-బీజేపీలు సైతం రాధా కోసం ప్రయత్నించాయి.

అయినా సరే రాధా ఏ పార్టీలో చేరలేదు. కానీ అధికారికంగా ఆయన ఇంకా టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ నేతలతో కలిసి పనిచేస్తున్నారు. కాకపోతే రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మీడియాలోకి వచ్చి వైసీపీపై విమర్శలు చేయడం లేదు. అలా అని టీడీపీకి మద్ధతుగా మాట్లాడుతున్నట్లు కనిపించడం లేదు. ఏదో న్యూట్రల్‌గా ఉంటున్నట్లు కనిపిస్తున్నారు.

అయితే ఇదంతా పైకి కనిపించేది మాత్రమే..రాధా బ్యాగ్రౌండ్‌లో టీడీపీ బలోపేతం కోసం పనిచేస్తున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే అమరావతి రైతులకు అండగా ఉంటూ వస్తున్న రాధా..కాపు ప్రభావిత నియోజకవర్గాల్లో వైసీపీకి చెక్ పెట్టేలా..టీడీపీ బలం పెరిగేలా ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీ-జనసేన పొత్తు కూడా ఫిక్స్ అయ్యేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా గాని వైసీపీని ఓడించడమే లక్ష్యంగా రాధా పనిచేస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news