కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాజాగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఘర్షణ వద్దని , ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామన్నారు. అంతేకాకుండా.. మా పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి టీఆర్‌ఎస్ ఎమ్మేల్యేలు భయపెడుతున్నారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది కల్వకుంట్ల స్వామ్యం కాదు.. నేషనల్ వాటర్ క్వాలిటీ సబ్మిషన్, రూరల్ వాటర్ డ్రింకింగ్ కింద 723 కోట్లు మంజూరు చేసింది. మార్చ్ 2016 లో వాటర్ ప్యూరిఫికషన్ పాయింట్స్ కోసం 95 కోట్లు ఇవ్వడం జరిగింది. 2016, 17 లో కలిపి 800 కోట్లు మంజూరు చేయడం జరిగింది.. టీఆర్ఎస్ ఎంపీల ప్రశ్నలకు కేంద్రం ఇచ్చిన సమాధానం ఇది.
నీరాజనాలు వస్తె రాష్ట్రానికి, నీలాపనిందలు కేంద్రానికి… తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని వదిలి పెట్టే సమయం వచ్చింది. తెలంగాణ లో కమిషన్ లేని కాంట్రాక్ట్ లు లేవు… ఆ కుటుంబం దోచుకొని రంగం లేదు. తెలంగాణ ఉద్యమ కారులను వెన్నుపోటు పొడిచారు. రిటర్నింగ్ అధికారి మీద ఒత్తిడి తెచ్చారు కోర్ట్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు .. కేసీఆర్ ఇష్టం తో గుర్తుల కేటాయింపు జరగదు… దానికి ఓ పద్ధతి ఉంటుంది…. కల్వకుంట్ల మాఫియా రాజ్యం గా తెలంగాణ ను మారుస్తున్నారు. ట్విట్టర్ పోస్టింగ్ లకు కూడా ఓ లిమిట్ ఉంటుంది…