వాట్సాప్‌కు వధువు బానిసైందన్న కారణంతో పెళ్లి రద్దు చేసుకున్న వరుడు..!

-

నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌లలో తలలు పెట్టి పైకెత్తడం లేదు. అదే పనిగా ఫోన్ల వాడకం ఎక్కువైంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు సోషల్ మీడియాలోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో విహరిస్తున్నారు. దీనిపై పలువురు సైంటిస్టులు కూడా పలు హెచ్చరికలు చేశారు. సోషల్ మీడియా ఉపయోగం నేటి తరం వారికి వ్యసనంగా మారిందని అంటున్నారు. అయితే అలాంటి వ్యసనమే పీటల దాకా వచ్చిన ఆ యువతి పెళ్లిని చెడగొట్టింది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే…

అది యూపీలోని నౌగావ్ సాదత్ అనే గ్రామం. అక్కడికి సమీపంలోని ఫకీర్‌పుర అనే ప్రాంతానికి చెందిన ఖమర్ హైదర్ అనే వ్యక్తి కుమారుడికి, నౌగావ్ సాదత్ గ్రామానికి చెందిన ఉరోజ్ మెహంది అనే వ్యక్తి కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది. వధువు తరఫు వారు అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి కోసం అన్నీ సిద్ధం చేశారు. తీరా పెళ్లి రోజు రానే వచ్చింది. ఓ వైపు పెళ్లికి పెట్టిన టైం దాటిపోతోంది. అయినా పెళ్లి కొడుకు గానీ, అతని తరఫు వారు గానీ ఎవరు రాలేదు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తండ్రి ఖమర్ హైదర్ ఈ పెళ్లి రద్దు చేసుకుంటున్నామని, తాము రావడం లేదని చెప్పడంతో మెహంది, అతని బంధువులు ఖంగు తిన్నారు.

అయితే పెళ్లిని ఎందుకు రద్దు చేసుకుంటున్నారని అడగ్గా, పెళ్లి కూతురు ఎప్పుడు చూసినా వాట్సాప్‌లో కాలక్షేం చేస్తుందని, అలాంటి యువతితో పెళ్లికి ఒప్పుకోమని, పెళ్లి జరగదని పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కుమార్తె తండ్రికి చెప్పాడు. కానీ దీన్ని సీరియస్‌గా తీసుకున్న మెహంది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి కొడుకు తరఫు వారు కట్నం ఇవ్వనందునే పెళ్లి రద్దు చేసుకున్నారని, వారు తనను రూ.65 లక్షలు డిమాండ్ చేశారని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కానీ.. పెళ్లి కొడుకు తరఫు వారు మాత్రం పెళ్లి కూతురు వాట్సాప్‌కు వ్యసన పరురాలిలా మారిందనే పెళ్లి రద్దు చేసుకున్నామని చెబుతున్నారు. ఏది ఏమైనా.. వాట్సాప్ వల్ల పెళ్లి రైద్దెందన్న ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news