ట్విటర్ టిల్లు ఇప్పుడేమంటావ్.. ఆ వీడియోలతో నిలదీసిన బండి సంజయ్

-

చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ మంత్రి కేటీఆర్ ప్రధానికి పోస్ట్ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని అన్నారు. ఈ విషయంపై కేటీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ ను మీడియా ఎదుట ప్రదర్శించారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ చౌటుప్పల్ లోని చినకొండూరు రోడ్డు వద్ద ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు బయలుదేరుతుండగా మీడియా ప్రతినిధులు కేటీఆర్ ప్రధానికి లేఖ రాసిన అంశాన్ని ప్రస్తావించారు. వెంటనే స్పందించిన బండి సంజయ్ చేనేతపై జీఎస్టీ విధించాలంటూ కేటీఆర్ చేసిన వీడియో క్లిప్పింగ్ ను ప్రదర్శించారు.

‘‘ఇదిగో వీడియో ట్విటర్ టిల్లు దీనికేం సమాధానం చెబుతావ్? జీఎస్టీ సమావేశంలో పాల్గొన్నదెవరు? అక్కడ ఏం చెప్పినవ్.. చేనేతపై 5 శాతం జీఎస్టీ వేయాలని కేంద్రాన్ని కోరింది నువ్వే కదా. మరి రద్దు చేయాలని చెప్పకుండా ఏం చేసినవ్?’’ అని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news