శుభవార్త.. టీడీఎస్‌ సమర్పణకు గడువు పొడిగింపు…!

-

గుడ్ న్యూస్. నాన్-వేతన త్రైమాసిక టీడీఎస్‌ వివరాలను సబ్మిట్ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గడువు పొడిగించింది. నవంబర్ 30 వరకు ఈ అవకాశం వుంది. ఇక పూర్తి వివరాలను చూస్తే.. వేతనాలకు సంబంధం లేని త్రైమాసిక టీడీఎస్‌ వివరాలను 26Q ద్వారా దాఖలు చేస్తారు.

ఫారం 26క్యూలో కలిగే ఇబ్బందులను చూసి ఈ డేట్ ని ఎక్స్టెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇలా సబ్మిట్ చేయడం లో ఇబ్బందులు ఉంటున్నాయని.. వాటి మూలం గానే గడువు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే ఫారమ్ 26Qలో TDS వివరాలను సబ్మిట్ చేయడం కష్టం అవుతుండడం తో ఈ డేట్ ని ఎక్స్టెండ్ చేసారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్‌ల సమర్పణ గడువును 7 రోజులు ఎక్స్టెండ్ చేసారు. ఇది వరకు అయితే అక్టోబర్ 30 చివరి తేదీ కానీ ఇప్పుడు దాన్ని నవంబర్ 7 వరకు గడువును పొడిగించింది. కనుక నాన్-వేతన త్రైమాసిక టీడీఎస్‌ వివరాలను సబ్మిట్ చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఇచ్చిన డెడ్ లైన్ ని గమనించండి. త్రైమాసికంలో చెల్లించిన మొత్తం, దానిపై మినహాయించబడిన పన్ను ఇవన్నీ కూడా ఫారమ్ 26Qలో ఉంటాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news