బీజేపీతో పొత్తు కొనసాగే అంశంపై పవన్ కల్యాణ్ ఓ క్లారిటీకి వచ్చేసేలా ఉన్నారు. ఇప్పటికే వైసీపీపై పోరు ఉదృతం చేసిన పవన్..నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే..టీడీపీతో తప్పనిసరిగా కలవాల్సిన పరిస్తితి. లేదంటే వైసీపీనీ ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. పవన్ సింగిల్ గా పోటీ చేస్తే జనసేనకు 10 సీట్లు కూడా రావు. బీజేపీతో పొత్తు ఉపయోగం ఉండదు. కానీ టీడీపీతో కలవడానికి బీజేపీ ఇష్టపడటం లేదు.
ఈ క్రమంలో పవన్ తన ఆలోచన మార్చుకునే ఛాన్స్ ఉందని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. బీజేపీ కలిసొస్తే సరే..లేదంటే బీజేపీని వదిలేసి టీడీపీతో జత కట్టడానికి పవన్ రెడీ అవ్వడం ఖాయమని ఇటీవల చంద్రబాబుతో కలిసిన తర్వాత పరిణామాలని బట్టి అర్ధమవుతుంది. పవన్ మరింత దూకుడుగా వైసీపీపై పోరాటం చేస్తున్నారు. అటు వైసీపీ సైతం ఇంకా ఎక్కువగా పవన్‌ని టార్గెట్ చేస్తున్నారు.
ఈ పోరులో పవన్‌కు టీడీపీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది గాని…బీజేపీ అంతగా సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే 11, 12న విశాఖలో మోదీ పర్యటన ఉంది. ఈ పర్యటన మొత్తం వైసీపీనే చూసుకుంటుంది. అయితే మోదీ వచ్చే పర్యటనకు పవన్‌ని ఆహ్వానిస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఇక వైసీపీనే మోదీ సభ ఏర్పాటు చేస్తుంది. దీనిపై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ప్రధాని సభని విజయవంతం చేస్తామని చెప్పి.. విశాఖలో రైల్వే జోన్ తో సహా జరుగుతున్న పలు కార్యక్రమాలకు అందరిని ఆహ్వానిస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని కూడా ఆహ్వానిస్తారా అని మీడియా నుంచి ప్రశ్న ఎదురవ్వగా, దానికి సమాధానం చెప్పలేదు. అంటే మోదీ సభకు పవన్‌కు ఆహ్వానం లేదు..ఇలా మిత్రపక్షమే దూరం పెడుతూ…వైసీపీకి అనుకూలంగా ఉంటున్న నేపథ్యంలో పవన్ ఇంకా బీజేపీతో తెగదెంపులు చేసుకునే ఛాన్స్ ఉంది.