2 పెళ్ళిళ్ళు చేసుకున్నా.. నా కోరిక తీరలేదు అంటున్న కరాటే కళ్యాణి..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె నటిగా కంటే ఎప్పుడు వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. తరచూ తనకు సంబంధంలేని వివాదాలలో తలదూరుస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది. మరొకవైపు బిజెపి నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇంకొక వైపు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణి రెండు పెళ్లిళ్లు చేసుకున్నా కూడా తన కోరిక ఇంకా తీరలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. భార్య అంటే వంటింటికే పరిమితం అవ్వాలని కోరుకునే మగవారు కూడా ఉంటారు. కానీ నేను ఆ రకం కాదు.. నిప్పులాంటి దాన్ని.. నిప్పును అరచేతిలో ఎక్కువసేపు పట్టుకోలేరు.. అందుకే నన్ను కూడా వదిలించుకున్నారు అంటూ తెలిపింది. ఇక మొదటి భర్తతో ఎక్కువ కాలం ఉండలేక రెండో వివాహం చేసుకున్నాను. అయితే అతడు కూడా ప్రతిరోజు తాగొచ్చు మానసికంగా , శారీరకంగా ఇబ్బంది పెడుతుంటే గొడవపడడం ఇష్టం లేక అతడికి కూడా విడాకులు ఇచ్చేసాను అంటూ తెలిపింది. అంతేకాదు చెయ్యని తప్పుకు ఎవరైనా నిందలు వేస్తే వాటిని భరించే శక్తి కూడా తనకు లేదని తెలిపింది కరాటే కళ్యాణి.

ప్రేమ పేరుతో వారు తనను మోసం చేశారు అని, నిజమైన ప్రేమ చూపించే అబ్బాయి దొరికితే అతనితో సహజీవనం చేయడానికి వెనుకాడను అంటూ తెలిపింది. అలాగే తనకు పిల్లలంటే ఇష్టం అని.. పిల్లల కోసమే రెండు పెళ్లిళ్లు చేసుకున్నా అని.. అయితే ఏ ఒక్కరూ కూడా తన కోరిక తీర్చలేకపోయారు అంటూ వెల్లడించింది. ఏది ఏమైనా ఇప్పుడు కరాటే కళ్యాణి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news