కృష్ణ మరణం పట్ల బాధ పడాల్సిన అవసరం లేదు – RGV

-

కృష్ణ మరణం పట్ల బాధ పడాల్సిన అవసరం లేదని వివాదస్పద ట్వీట్‌ చేశారు టాలీవుడ్‌ సంచలన దర్శకుడు RGV. సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల బాధ పడాల్సిన అవసరం లేదని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ‘బాధపడాల్సిన అవసరం లేదన్నారు వర్మ.

ఎందుకంటే స్వర్గంలో కృష్ణ, విజయనిర్మల కలిసి పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ ఆనందంగా గడుపుతుంటారని అనుకుంటున్నా’ అని తెలిపాడు. కృష్ణ, విజయ నిర్మల కలిసి నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలోని డ్యూయెట్ సాంగ్ ను ఆర్జీవి షేర్ చేశాడు. కాగా, కృష్ణ అలియాస్ శివరామకృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news