BREAKING : ఎల్లుండి షూటింగ్స్ బంద్

-

BREAKING : సూపర్ స్టార్ కృష్ణ అలియాస్ శివరామకృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరొకవైపు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఒకే ఏడాది మూడు మరణాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు జీవితంలో ఇంతటి కంటే దుర్భర సన్నివేశాలు మరొకటి లేదని చెప్పాలి. ఇక సూపర్ స్టార్ కృష్ణ మృతి నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి టాలీవుడ్‌ లో షూటింగ్‌ లు బంద్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది చిత్ర పరిశ్రమ. ఈ విధంగా సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news