TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త.. నేడు వర్చువల్‌ ఆర్జిత సేవా టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త వచ్చేసింది. వర్చువల్‌ సేవా టిక్కెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది టీటీడీ. నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది టీటీడీ. ఇప్పటికే డిసెంబర్ నెలకు సంబంధించిన రూ. 300 దర్శన కోటాను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. దర్శన కోటా విడుదలైన 80 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు. వాస్తవానికి, డిసెంబర్ నెల టికెట్ల కోటాను అక్టోబర్‌లోనే విడుదల చేయాల్సి ఉండగా.. వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని డిసెంబర్‌ నుంచి మార్పు చేయాలని టీటీడీ నిర్ణయానికి రావడంతో స్లాట్ల సర్దుబాటులో భాగంగా జాప్యం జరిగింది.

Tirupati opens darshan slots for Jan, devotees will have to pay ₹1 cr |  Latest News India - Hindustan Times

ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా 5,06,600 టికెట్లను వివిధ స్లాట్లలో విడుదల చేయడం.. హాట్‌ కేకుల్లా అయిపోవడం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఇక, ఈ నెల 16న డిసెంబర్ నెలకు సంబంధించిన వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. అలాగే, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా మరియు దర్శన టికెట్లను కూడా విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news