షాక్ ఇచ్చిన స్టేట్ బ్యాంక్… పెరగనున్న ఈఎంఐలు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఎన్నో రకాల స్కీమ్స్ ని కూడా తీసుకు వస్తోంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ 15 బేసిస్ పాయింట్స్ వరకు పెంచేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే అన్ని కాలవ్యవధులకు పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి దీనితో అన్ని కాలవ్యవధులకు పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. దీని మూలంగా ఈఎంఐలు భారం కానున్నాయి.

నవంబర్ 15 నుంచి ఇవి అమలులోకి వస్తాయని బ్యాంకు అంది. హోమ్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు పరిగణలోకి తీసుకునే ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్స్ పెరిగిందట. అయితే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.95 శాతం నుంచి 8.05 శాతానికి పెరిగింది.

అదే మూడేళ్లది చూస్తే 10 బేసిస్ పాయింట్స్ పెరగడం వలన 8.25 శాతం నుంచి 8.35 శాతానికి చేరుకుంది. ఇదిలా ఉంటే నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పెరగడం వలన ఎంసీఎల్ఆర్ 7.60 శాతం నుంచి 7.75 శాతానికి చేరింది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 15 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 7.90 శాతం నుంచి 8.05 శాతానికి వెళ్ళింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్స్ పెరగడం వలన 7.60 శాతానికి చేరుకుంది. అయితే ఇలా ఎంసీఎల్ఆర్ పెంచడం అనేది కస్టమర్స్ కి చెడ్డ వార్తే.

 

Read more RELATED
Recommended to you

Latest news