తుంగభద్ర ట్రైన్‌కు పెను ముప్పు తప్పింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో గురువారం సాయంత్రం తుంగభద్ర రైలు ఇంజిన్..బోగీలు లేకుండానే ముందుకు వెళ్లింది. అయితే.. కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ సాయంత్రం గద్వాల రైల్వేస్టేషన్‌కు వచ్చి ఆగింది. తిరిగి వెళ్లే క్రమంలో ఇంజిన్ కు, బోగీలకు మధ్య ఉండే లూప్ లాక్ తెగిపోవడంతో ఇంజిన్ఒక్కటే దాదాపు 50 మీటర్ల వరకు వెళ్లింది. గమనించిన లోకో పైలట్ మళ్లీ ఇంజిన్‌ను వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది.
కొద్దిసేపటికి బోగీలకు తగిలించుకొని లూప్ లాక్ సరిచేసుకొని తిరిగి తీసుకువెళ్లారు. ట్రైన్ ఫాస్ట్ గా వెళ్లే క్రమంలో లూప్ లాక్ తెగిపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ట్రైన్ ఆగి వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.