సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా ప్రేక్షకులను కలచి వేసింది.సూపర్ స్టార్ కృష్ణ 350కిపైగా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. సినిమా టెక్నాలజీకి సంబంధించిన అనేక కొత్త అంశాలను పరిచయం చేశారు. సాహసాల కృష్ణగా నిలిచిపోయారు. హీరోగా అనేక రకాల పాత్రలు చేశారు. తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఒక ఇంటర్వ్యూ లో విజయనిర్మల గారు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలియచేసారు. కృష్ణ గారు ఎప్పుడూ సినిమా ద్యాసలోనే ఉంటారని, అస్సలు సెలవు తీసుకోకుండా కూడా పనిచేసిన రోజులు ఉన్నాయని తెలిపారు.ఆయనకు పడుకోవడానికి కూడా సమయం ఉండేది కాదని ఒక్కో సారి మూడు షిప్ట్స్ లో పనిచేసే వారని రోజులో కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే పడుకొనే అవకాశం ఉండేదని అన్నారు.
అలాగే కృష్ణ గారు అలసిపోయి షూటింగ్ లో పడుకుంటే ఆ సినిమాలో నిద్రపోయే సన్నివేశాలు ఉంటే అప్పుడే ఆ షూటింగ్ కూడా పూర్తి చేసుకొనే వారని అంతలా ఆయన బిజీగా ఉండే వారిని తెలిపింది. ఇక ఆయన ఎక్కడ షూటింగ్ లో ఉన్నా నేనుకూడా ఉండి నా చేత్తో వండి పెట్టే దాన్నని, నా వంట అంటే చాలా ఇష్టపడతారు అని, విదేశాలకు వెళ్ళినా కూడా మేము మా వంట సామాను వెంట పెట్టుకునే వెళ్లేవారమని చెప్పుకొచ్చారు.