వెండి తెర వేశ్యలు వీళ్లే.. !

-

వెండి తెర నటించాలి అంటేనే అద్భుతాలు ప్రదర్శించాలి.. తమ అందంతో, అభినయంతో ప్రేక్షకులను కట్టి పడేయాలి. ఎన్నో విభిన్న పాత్రలో నటిస్తూ కెరీర్ను మలుపు తిప్పుకోవాలి. అయితే అన్ని పాత్రలు కన్నా వెండితెరపై వేశ్యగా కనిపించడం పెద్ద సాహసం అనే చెప్పాలి. నిజానికి అలాంటి పాత్ర చేయాలి అంటే ధైర్యం, తెగువ ఉండాలి. సమాజంలో ఏం జరుగుతుందో చూపించాలి అంటే ఆ పాత్రలో లీనమవ్వాలి… మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించాల్సి రావచ్చు. అయితే ఈ విషయాలు ఏవి పట్టించుకోకుండా కెరీర్ లో మంచి స్థాయిలో ఉన్నప్పుడే కొందరు హీరోయిన్స్ ఈ పాత్రలో కనిపించి మెప్పించారు.. వారెవరో ఓసారి చూద్దాం..

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి చిత్రంలో చార్మి వేశ్యగా కనిపించి మెప్పించింది..

దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకేక్కించిన భక్తి రస చిత్రం పాండురంగడు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో టబు వేశ్యగా కనిపించింది..

విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం వేదం.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క వేశ్యగా నటించారు.

డేర్ మూవీలో అంజలి వేశ్యగా కనిపించారు. బిందు మాధవి సెగ చిత్రంలో వేశ్యగా నటించారు.

తమిళ చిత్రం ధనం లో సంగీత వేశ్యగా నటించి ఆకట్టుకున్నారు. ఇందులో సంగీత రోల్ కొంచెం బోల్డ్ గా ఉంటుంది.

2006లో ధనుష్ హీరోగా విడుదలైన ధూల్ పేట్ మూవీలో స్నేహ వేశ్య పాత్ర చేశారు.

పవిత్ర చిత్రంలో శ్రియా వేశ్యగా నటించారు. ఈ చిత్రంలో సాయికుమార్, రోజా ప్రధాన పాత్రలో కనిపించారు..

తరగని అందంతో ఇప్పటికీ ప్రేక్షకులు అలరిస్తున్న నటి రమ్యకృష్ణ.. కమల్ హాసన్ హీరోగా తలకెక్కిన పంచతంత్రం చిత్రంలో రమ్యకృష్ణ వేశ్య పాత్ర చేశారు.

శృతి హాసన్ హిందీ మూవీ ‘డి డే’లో బోల్డ్ సన్నివేశాల్లో నటించి షాక్ ఇచ్చారు. మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నేపధ్యంలో తెరకెక్కిన డి డే మూవీలో శృతి హాసన్ పాకిస్తాన్ కి చెందిన వేశ్యగా నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news