లైఫ్ సర్టిఫికేట్ నుండి గ్యాస్ సిలెండర్ల వరకు డిసెంబర్‌ 1 నుంచి మారనున్న అంశాలు ఇవే..!

-

ప్రతీ నెలా కూడా కొన్ని విషయాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇంక ఇప్పుడు నవంబర్ కూడా అయ్యిపోతోంది. డిసెంబర్ కొన్ని రోజుల్లోనే వచ్చేస్తోంది. దీనితో ప్రతీ నెలా లానే ఈ నెల కూడా కొన్ని అంశాల్లో మార్పులు వచ్చాయి. మరి డిసెంబర్‌ 1 నుంచి ఎలాంటి మార్పులు రానున్నాయి. ఏయే విషయాల్లో ఎలాంటివి చోటు చేసుకోనున్నాయి అనేది చూసేద్దాం. ఇక పూర్తి వివరాలను చూస్తే…

పెన్షన్ పొందే వాళ్ళు ప్రతీ సంవత్సరం కూడా లైఫ్ సెర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి వుంది. ఈ సర్టిఫికేట్‌ను 30 నవంబర్ 2022లోపు సమర్పించాలి. అయితే దీన్ని సబ్మిట్ చేయడానికి 30 నవంబర్ 2022 వరకే ఛాన్స్ వుంది. కనుక ఈ నెల ముగిసే లోగా సబ్మిట్ చేసేయండి. లేదంటే చిక్కులో పడే అవకాశం వుంది.

అలానే వచ్చే నెల అంటే డిసెంబర్ లో 13 రోజులు బ్యాంకులు పని చేయవు. హాలిడేస్ తో పాటుగా నాల్గవ శనివారం, ఆదివారాలు కూడా వున్నాయి. కనుక వీటిని కూడా చూసుకోవడం మంచిది.

సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను ప్రతీ నెలా కూడా మారుస్తూ వుంటారు. దేశవ్యాప్తంగా ప్రతి నెలా మొదటి రోజు లేదా మొదటి వారంలో ఈ ధరల్ని మారుస్తారు కనుక ఈసారి కూడా మార్పు ఉంటుంది. ఈసారి మాత్రం ఈ ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. కనుక చూసుకోండి.

వాణిజ్య సిలిండర్‌పై కేంద్రం ధరలను తగ్గించేలానే కనపడుతోంది. మరి ఏ చేస్తుంది అనేది చూడాల్సి వుంది. ఇంకా ఎలాంటి మార్పు అయితే చేయలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news