పవన్ కళ్యాణ్ పై రాజధ్రోహం కేసు నమోదు చేయాలి – డిప్యూటీ సీఎం రాజన్న దొర

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కూలుస్తానంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ పై రాజ ద్రోహం కేసు నమోదు చేయాలని.. ప్రజలను రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగపరమైన ప్రభుత్వాన్ని కూలగొడతానని అనడం రాజేద్రోహం కిందకు వస్తుందని అన్నారు.

వ్యక్తిగతంగా తాను ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానినని అన్నారు. పవన్ కళ్యాణ్ ను ఎన్నికలలో పోటీ చేయమని.. ముఖ్యమంత్రి అభ్యర్థినని చెప్పుకోమనే చెబుతున్నామని అన్నారు. ప్రజల తరఫున పోరాడతానని అనడంలో తప్పులేదు కానీ.. రాజ్యాంగపరమైన ప్రభుత్వాన్ని కూలగొడతానని అనడం రాజా ద్రోహం కిందకి వస్తుందన్నారు రాజన్న దొర.

Read more RELATED
Recommended to you

Latest news