హను-మాన్ కు పొగడ్తలు,ఆదిపురుష్ కు తిట్లు విచిత్రం గా ఉందే..!!

-

యంగ్  హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ  తెరకెక్కిస్తోన్న మరో చిత్రం హను-మాన్. . ఇటీవల విడుదలైన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటూ మంచి వ్యూస్ సాధిస్తోంది. చాలా మంది నుండి ప్రశంశలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమా టీజర్ ను ప్రభాస్ ఆదిపురుష్ సినిమా క్వాలిటీ తో పోలుస్తూ. చాలా మంది డబ్బు ఉంటేనే కాదు, కంటెంట్ మరియు కమిట్ మెంట్ ఉండాలని దొమ్మెత్తి పోశారు.అసలే గ్రాఫిక్స్ బాగా లేక క్వాలిటీ కోసం విడుదలను వాయిదా వేసుకున్న వారిని రీసెంట్ గా ఒక యూట్యూబర్ అలాగే సీన్లు తీసి ఈ సినిమా కు 500 అవసరమా అని అడిగేలా చేసాడు. దీనితో ఆదిపురుష్ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక”హను-మాన్” సినిమా టీజర్ పై  లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. అలానే కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డి రీసెంట్ గా ‘హను మాన్’ టీజర్ చూసి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా కలిసి అభినందించారు. వాస్తవానికి’ఆది పురుష్’ సినిమాకి కూడా బీజేపీ మద్దతు లభిస్తుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే వారు ఉత్తర ప్రదేశ్ వెళ్లి అక్కడ నది ఒడ్డున భారీ స్థాయిలో టీజర్ విడుదల చేశారు. కాని టీజర్ చూసి పొగడడం వదిలి, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అదే హునుమాన్ కు మాత్రం పొగడ్తలు కురిపిస్తున్నారు. విచిత్రంగా ఉందే..!!

Read more RELATED
Recommended to you

Latest news