టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 160 సీఆర్పీసీ కింద వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది సిబిఐ. కేవలం వివరణ కోసం మాత్రమే నోటీసు ఇచ్చినట్లు సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ కానున్నారు.
ఆమె కాసేపట్లో ప్రగతి భవన్ కు బయలుదేరనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి, సిబిఐ కేసులపై కేసీఆర్ తో ఆమె చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆరవ తేదీన తన ఇంటి వద్ద విచారణకు హాజరవుతారని కవిత సిబిఐకి రిప్లై ఇచ్చిన నేపథ్యంలో కెసిఆర్ తో భేటిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు కవిత ఇంటి దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.