BIG BREAKING : డిసెంబర్ 21న ఖమ్మంలో టీటీడీపీ భారీ బహిరంగ సభ

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని చంద్రబాబు.. తాజాగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు చంద్రబాబు. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచుతుండగా.. పార్టీలు నేతల, దూకుడుతో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అయితే.. 2018 తరహాలోనే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారంతో విపక్ష పార్టీలు నిత్యం జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సర్వేలు చేస్తూ తమ పార్టీ పరిస్థితిని బేరీజు వేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ సీన్ లోకి చంద్రబాబు రీఎంట్రీ ఇస్తున్నారు. గతంలో వరద ప్రభావిత గ్రామాల పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు చంద్రబాబు. ఏలూరు జిల్లాలో మీదుగా భద్రాద్రి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు భద్రాచలంలో బస చేశారు. భద్రాచలం రామయ్యను దర్శించుకుని, అనంతరం గోదావరి ముంపు ప్రాంతాల్లో తిరిగారు. గోదావరి వరద నుంచి భద్రాచలంను కాపాడిన కరకట్టను పరిశీలించారు చంద్రబాబు.

Chandrababu Naidu begins 12-hour fast after house arrest, TDP protests  across AP | The News Minute

2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా గోదావరికి భారీగా వరదలు వచ్చి భద్రాచలం నీట మునిగింది. అయితే.. తెలంగాణలో టీడీపీకి అద్భుతమైన స్పందన ఉందన్నారు చంద్రబాబు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. పార్టీకి నూతన ఉత్తేజం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చంద్రబాబు గత పర్యటనలో ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో టీటీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు ప్రకటించాయి. ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో 5లక్షల మందితో భారీ బహరింగ సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు టీటీడీపీ నేతలు వెల్లడించారు. అయితే.. ఈ భారీ బహిరంగ సభకు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news