ఐపీఎల్ జట్టు అయిన లక్నో కెప్టెన్సీ కేఎల్ రాహుల్ కెరీర్ ప్రమాదంలో పడింది. డిసెంబర్ 23న జరిగే మినీ వేలంలో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను సొంతం చేసుకునేందుకు లక్నో సూపర్ జేయింట్స్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం లక్నో దగ్గర రూ. 22 కోట్ల రూపాయలు పర్సు మిగిలి ఉంది. వేలంలో లక్నో కనీసం నలుగురు ప్లేయర్లను సొంతం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ కోసం భారీ ధరను వెచ్చించేందుకు లక్నోసిద్ధమైనట్లు తెలుస్తోంది. బెన్ స్టోక్స్ ను సొంతం చేసుకున్నంత మాత్రాన రాహుల్ కెప్టెన్సీకి వెంటనే వచ్చే ప్రమాదం ఏం ఉండదు. అయితే సీజన్ సాగే కొద్దీ అతడి వ్యక్తిగత ఫామ్ తో పాటు కెప్టెన్సీ పేలవంగా ఉంటే మాత్రం బెన్ స్టోక్స్ ను కెప్టెన్ గా చేసే అవకాశం ఉంటుంది.