సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్..BRS ఎమ్మెల్యేల రహస్య భేటీ ?

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈడీ, ఢిల్లీ లిక్కర్‌ కేసు వ్యవహారం నడుస్తోంది. ఎప్పుడు ఈడీ నోటీసులు వస్తాయేనని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు హడలెత్తిపోతున్నారు. అటు వరుసగా తెలంగాణ మంత్రులు అయిన తలసాని, మల్లారెడ్డి ఇండ్లపై సీబీఐ అధికారులు దాడులు చేశారు.

ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ ఓ అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాదులో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో జరిగిన ఈ భేటీకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గ సమస్యలపైనే భేటీ అని ఆయా నేతలు చెబుతుండగా, ఓ మంత్రికి వ్యతిరేకంగా వీరంతా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news