కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ అనుబంధం..

-

గత కొన్నాళ్లుగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం 4 గంటలకు తుది శ్వాస విడిచారు.. అయితే ఆయనకు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమని తెలుస్తోంది..

అప్పట్లో కైకాలను ఎన్టీఆర్​లా ఉండేవారని అందరూ అనేవారట.. అలా ఎన్టీఆర్కు దగ్గర పోలికలు ఉండటం వల్ల చాలా సినిమాల్లో ఆయనకు డూప్ గా నటించారు.. అలాగే 1960 లో వచ్చిన ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలో నటుడిగా అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో ఆయనకు ఆవకాశం ఇప్పించింది రామారావే. ఆ చిత్ర దర్శకుడు ఎస్డీ లాల్ విఠలాచార్య శిష్యుడు కావటం వల్ల సత్యనారాయణలో ఉన్న ట్యాలెంట్‌ను గుర్తించి విఠలాచార్యకు పరిచయం చేశారు. ఈ అవకాశం ఆయన కెరీర్ను మలుపు తిప్పింది..

కేవలం హీరో పాత్రల కోసం చూడకుండా విలన్ పాత్రలు చేసేవారు లేరని ఆ కొరతను తీర్చాలంటే విటలాచార్య ఇచ్చిన సలహాను మనస్పూర్తిగా స్వీకరించారు సత్యనారాయణ… అలా అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చాలా చిత్రాల్లో విలన్ గా సత్యనారాయణ నటించారు.. దాదాపు వీరిద్దరి కాంబినేషన్లో వందకు పైగా చిత్రాలు తెరకేక్కాయి.. అలాగే ఓ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాంబినేషన్లో వచ్చిన అత్యధిక చిత్రాలు బహుసా ఇవే నేమో. అలాగే ఎన్టీఆర్ ద్విపత్రాభినయం చేసిన రాముడు భీముడు చిత్రంలో ఎన్టీఆర్కు డూప్ గా నటించారు కైకాల సత్యనారాయణ. దాదాపు ఎన్టీఆర్ చేయడానికి అవకాశం లేని చాలా చిత్రాల్లో కైకాల నటించారు.. అలాగే ఇంతలా కష్టపడుతున్న ఈయనకు ఎన్నో అవకాశాలు ఇప్పించాలని ప్రతీ క్షణం ప్రయత్నాలు చేసే వారంట ఎన్టీఆర్.. ఈ తాపత్రయంతోనే ఎన్నో పౌరాణిక చిత్రాల్లో అవకాశాలు ఇప్పించారు ఎన్టీఆర్.. అయితే వీరిద్దరి మధ్య ఎన్నోసార్లు అభిప్రాయ బేధాలు వచ్చినప్పటికీ మళ్ళీ ఎంతో ఆప్యాయతగా తమ్ముడూ అంటూ ఎన్టీఆర్ పలకరించే వారిని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కైకాల..

Read more RELATED
Recommended to you

Latest news