బలం లేని బాబుతో..బీఆర్ఎస్‌లో టెన్షన్ ఎందుకు?

-

తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్ళీ ఎంట్రీ ఇవ్వడంతో బీఆర్ఎస్‌లో కాస్త టెన్షన్ మొదలైందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 2018 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత బాబు మళ్ళీ తెలంగాణ జోలికి వెళ్లలేదు.మళ్ళీ ఇంతకాలం తర్వాత ఖమ్మంలో భారీ సభ పెట్టి..టీడీపీ తెలంగాణకు చేసిన పనులు చెప్పి..ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన టీడీపీ నేతలు మళ్ళీ తిరిగొచ్చి..తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.

అంతే ఇంకా బాబు ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేయలేదు..కేసీఆర్ పేరు తీయలేదు..బీజేపీ, కాంగ్రెస్ ఊసు ఎత్తలేదు. కానీ బాబుని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి విమర్శలు చేశారు. మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్..వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి తర్వాత ఒకరు బాబుపై విమర్శలు చేశారు. ఏపీలో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు. చుక్కలో చంద్రుడు ఒక్కరే ఉంటారని అది కేసీఆర్ అని చెప్పి కవిత అన్నారు.

అయితే తెలంగాణలో బాబు ప్రభావం తగ్గిపోయింది..ఇక్కడ టీడీపీకి బలం కూడా తగ్గింది. గట్టిగా చూసుకుంటే ఒక్క సీటు గెలుచుకునే కెపాసిటీ  ఆ పార్టీకి కనిపించడం లేదు. అలాంటప్పుడు బీఆర్ఎస్ నేతలు హడావిడిగా ప్రెస్ మీట్లు బాబుని విమర్శించాలసిన అవసరం ఎందుకు వచ్చిందని విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ఇక వారు హడావిడిగా విమర్శలు చేయడానికి కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి టీడీపీకి ఒక్క సీటు గెలిచే బలం లేదు గాని…కొన్ని సీట్లలో గెలుపోటములని తారుమారు చేసే బలం ఉందని తెలుస్తోంది.

ఖమ్మ, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లోని కొన్ని స్థానాల్లో టీడీపీకి ఉన్న ఓట్లు బీఆర్ఎస్‌కు ముఖ్యం. ఇప్పుడు టీడీపీ అన్నీ చోట్ల పోటీ చేస్తానని అంటుంది. దాని వల్ల బీఆర్ఎస్‌కు పడే ఓట్లు పోయేలా ఉన్నాయి. అందుకే బీఆర్ఎస్ నేతలు బాబుపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news