రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద బిఆర్ఎస్, బిజెపి నాయకులు పోటాపోటీగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో కౌంటింగ్ కేంద్రం వద్దకి చేరుకొని గందరగోళం సృష్టించే వారిని చెదరగొట్టారు. పలువురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఇక 15 స్థానాలలో నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే మెజారిటీ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు. రేపు సెస్ చైర్మన్ అభ్యర్థిని మంత్రి కేటీఆర్ ప్రకటించనున్నారు.