విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్

-

ఏపీలోని ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్‌ బోర్టు శుభవార్త చెప్పింది. 2023, మార్చ్ 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం షెడ్యూల్‌ విడుదల చేసింది ఏపీ ఇంటర్‌ బోర్డు. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ దాకా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. అలాగే.. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.

Telangana Inter exams 2022 likely from last week of April - Telangana Today

ఏప్రిల్‌ నుంచి మే రెండో వారం దాకా ప్రాక్టికల్స్‌ కొనసాగనున్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణలోనూ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు అధికారులు డిసెంబరు 19న విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వరకు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news