తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కోసం చేపడుతున్న ప్రయోజనాలపై ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల (PVTGs) అభివృద్ధిపై రాష్ట్రపతి నిలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో PVTGs సభ్యులతో విద్యార్థులతో స్వయంగా మాట్లాడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విద్య, వైద్యం, సాగు, తాగునీరు కనీస మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. PVTGs కోసం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు.
గిరిజనుల కోసం ప్రత్యేకంగా వైద్య, విద్య, రోడ్లు, విద్యుత్, రైతుబంధు, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి సంక్షేమంపై సంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్రపతి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.