ఈ మధ్యన బ్యాంకులు ప్రజలకి అనుకూలంగా ఉండేందుకు వివిధ రకాల సేవలని అందిస్తున్నాయి. ఈ సేవల వలన చాలా రకాల బెనిఫిట్స్ ని పొందేందుకు అవుతుంది. అయితే ఒక్కోసారి ఒకరికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయి. అయితే ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే వీటిని తెలుసుకోవాలి.
లేదంటే చిన్న చిన్న సమస్యలు ఎదురవచ్చు. మరి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చెయ్యడం చాలా ముఖ్యం. ప్రతి బ్యాంకు ఖాతా లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. అలానే బ్యాంక్ ఖాతాను యాక్టివ్ గా ఉంచుకోవాలి. ఎక్కువ అకౌంట్స్ ఉంటే సైబర్ మోసం ప్రమాదం కూడా పెరుగుతుంది.
కనుక జాగ్రత్తగా ఉండాలి. అలానే బ్యాంకులు చార్జీలని కట్ చేస్తూ ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఆ చార్జీలు ఎక్కువ అవుతాయి. కాబట్టి చూసుకోండి. వివిధ వార్షిక సేవా ఛార్జీలను వసూలు చేస్తాయి బ్యాంకులు. అలానే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కనుక మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అవసరం లేని అకౌంట్స్ ని క్లోజ్ చేసుకోవడం మంచిది.