మెగాస్టార్ చిరంజీవి తాజాగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషించగా.. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 13వ తేదీన గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో.. దర్శకుడు బాబి కొల్లి మీడియాతో మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య సినిమా విశేషాలను పంచుకున్నారు..
ఇక ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి, రవితేజ కాంబినేషన్ ఎలా ఉండబోతోంది? వాల్తేరు వీరయ్య కథ ఏమిటి ? అని అడగ్గా.. దర్శకుడు మాట్లాడుతూ.. ప్రతి సీన్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే అద్భుతమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి. కలర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న చిత్రమే వాల్తేరు వీరయ్య. థియేటర్లలో తప్పకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది అని తెలిపారు. అలాగే వాల్తేరు వీరయ్య లో రవితేజ పాత్రను తీసుకోవడం వెనుక గల కారణం ఏమిటి అని అడగగా.. రవితేజ గురించి ఈ విషయం ఇప్పుడే చెప్పను.. సినిమాను 13వ తేదీ చూడగానే మీకే తెలుస్తుంది. రవితేజ లేకుండా వాల్తేరు వీరయ్య సినిమా లేదని మాత్రం కచ్చితంగా చెప్పగలను అంటూ తెలిపాడు.
ఇందులో రవితేజను తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. చిరంజీవికి చెప్పితే ఆయన కూడా మరో ఆలోచన లేకుండా ఓకే అనడంతో రవితేజను సంప్రదించాము. చిరంజీవి పై ఉన్న ప్రేమ, అభిమానం నాపై ఉన్న నమ్మకంతో వాల్తేరు వీరయ్యను చేయడానికి రవితేజ అంగీకరించాడు అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్.