జర భద్రం.. అక్కడ పతంగులు ఎగిరేస్తే జైలుకేనట

-

సంక్రాంతి పండుగ హైదరాబాద్ మహానగరంలో పోలీసులు కొన్ని నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో ప్రార్థన స్థలాల చుట్టుపక్కల ప్రాంతాలు, రహదారులపై గాలిపటాలు ఎగరేయడం నిషేధమని హైదరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. శాంతి భద్రతలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల అనుమతి లేకుండా డీజేలు, లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించొద్దని సీపీ ఆదేశించారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ ఉదయం 6 వరకూ తామిచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని, ఉల్లంఘించిన వారిపై హైదరాబాద్‌ పోలీసు చట్టం ప్రకారం చర్యలుంటాయని నోటిఫికేషన్‌ జారీ చేశారు. అందులోని వివరాలివీ..!

అమల్లో ఉండే నిబంధనలు:

  • బహిరంగ ప్రదేశాల్లో రెచ్చగొట్టే ఉపన్యాసాలు, సంగీతంపై నిషేధం.
  • బహిరంగ సమావేశాల్లో వక్తలు, ఇతర మైకుల శబ్దాలు పరిమితి దాటొద్దు. వాణిజ్య ప్రాంతాల్లో ఉదయం 65, రాత్రి 55 డెసిబుల్స్‌ దాటొద్దు.
  • నివాస ప్రాంతాల్లో ఉదయం 55, రాత్రి 45 డెసిబుల్స్‌ దాటొద్దు.
  • సున్నిత ప్రాంతాల్లో ఉదయం 50, రాత్రి 40 డెసిబుల్స్‌ మించొద్దు.
  • సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ రెండు రోజులు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌ స్పీకర్లు అనుమతించబోం.
  • ప్రహరీ లేని మేడలపై చిన్నారులు పతంగులు ఎగరేయకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి.
  • తెగిన గాలిపటాల కోసం చిన్నారులు రహదారులు, ఇతర ప్రాంతాల్లో పరుగెత్తకుండా.. విద్యుత్‌ స్తంభాలకు వేలాడే వాటిని తీసుకోకుండా అవగాహన కల్పించాలి.

Read more RELATED
Recommended to you

Latest news