Breaking : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్స్

-

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపుతామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ఆయన కార్యాలయం సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి శనివారం ఉదయం ఫోన్ చేసి, గడ్కరీని హత్య చేయడంతోపాటు నాగ్‌పూర్‌లోని ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని బెదిరించినట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. నేడు కొద్ది వ్యవధిలో మూడు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తొలుత 11.25 గంటలకు ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు, ఆ తర్వాత 11.32 గంటకు, 12.32 గంటలకు ఫోన్ చేసినట్టు గుర్తించారు.

హుటాహుటీన గడ్కరీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. బెదిరింపు కాల్స్ పై విచారణ చేపట్టారు. కాల్ రికార్డులను సేకరించారు. నాగపూర్ లోని గడ్కరీ కార్యాలయం వద్ద బందోబస్తు పెంచారు. ఈ కాల్స్ బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ నుంచి వచ్చినట్టు నాగపూర్ డీసీపీ రాహుల్ మదానే వెల్లడించారు. గడ్కరీ కార్యాలయం వద్దే కాక, ఆయన పాల్గొనే కార్యక్రమాల వద్ద కూడా భద్రత పెంచుతున్నట్టు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news